: సెర్బియా తీరంలో 18 కి.మీ. పరచుకున్న మంచు గోళాలు... ఎక్కడివో? ఏంటో?
వేలకొద్దీ మంచు ముద్దలు... అవి కూడా గుండ్రంగా ఎవరో తీర్చిదిద్దినట్టుగా ఉన్నవి. దాదాపు 18 కిలోమీటర్ల మేరకు సెర్బియా తీరంలో పరుచుకున్నాయి. గల్ఫ్ ఆఫ్ ఓబీ వద్ద ఇవి రాత్రికి రాత్రే ప్రత్యక్షం కాగా, ఇవి ఎక్కడి నుంచి వచ్చాయో, ఎలా ఏర్పడ్డాయో అన్న విషయమై ప్రజలు ఆలోచిస్తుండగా, సమాధానం లభించక శాస్త్రవేత్తలు సైతం తలపట్టుకుంటున్నారు. ఓ టెన్నిస్ బాల్ సైజు నుంచి ఒక మీటర్ వ్యాసం వరకూ ఉన్న మంచు ముద్దలు ఇక్కడ లక్షల సంఖ్యలో కనిపిస్తున్నాయి. పర్యావరణ మార్పుల్లో భాగంగా, గాలి ప్రభావంతో నీరు అతి శీతల పరిస్థితుల్లో ప్రవహిస్తే, ఇలా మంచు గోళాలు ఏర్పడతాయని, ఇలా ఒకేసారి వివిధ రకాల సైజుల్లో ఇన్ని ఏర్పడటం అరుదైన విషయమని నిపుణులు అంటున్నారు. వీటిని చూసేందుకు పెద్దఎత్తున స్థానికులు తరలివస్తుండటంతో ఈ ప్రాంతంలో సందడి నెలకొంది. డిసెంబర్ 2014లో ఫిన్ ల్యాండ్ లోని మిచిగాన్ లేక్ వద్ద ఇదే తరహాలో మంచు గోళాలు ఏర్పడ్డాయి.