: 70 మందిని ఆస్పత్రి పాలు చేసిన పానీపూరీ


మక్కువతో తిన్న పానీపూరీ... ప్రాణాల మీదకు తెచ్చింది. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలోని శెట్టి ఆత్మకూర్ గ్రామంలో చోటు చేసుకుంది. గద్వాల నుంచి తోపుడు బండిపై వచ్చే ఓ వ్యక్తి ఆ గ్రామంలో పానీపూరీ అమ్ముతుంటాడు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం గ్రామంలోకి రాగానే చాలా మంది పెద్దలు, పిల్లలు పానీపూరీ తిన్నారు. ఈ సమయంలో అతడి వద్ద నీరు అయిపోవడంతో... పక్కనే ఉన్న చేతి పంపు నీరు పట్టుకుని పానీ తయారు చేశాడు. రాత్రి 10 గంటలు కాగానే పానీపూరీ తిన్న వారందరికీ వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి మొదలయ్యాయి. వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి వారు పరుగులు తీశారు. చేతి పంపు నీరు ఉప్పనీరు కావడంతోనే ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని గ్రామస్తులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News