: ప్రధాని పేరు పలికే దమ్ము కూడా లేని జగన్ రాష్ట్రంలో చిందులు వేస్తున్నారు: మంత్రి దేవినేని ఉమ
జై ఆంధ్రప్రదేశ్ పేరుతో విశాఖపట్నంలో ప్రత్యేక హోదా కోసం సభ నిర్వహించిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. జగన్ రాష్ట్రప్రయోజనాల దృష్ట్యా పోరాడడం లేదని, ముఖ్యమంత్రి పదవి కోసం మాత్రమే ఆరాటపడుతున్నారని ఆయన అన్నారు. ప్రధాని మోదీ పేరు పలికే దమ్ము కూడా లేని జగన్ రాష్ట్రంలో చిందులు వేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఛత్తీస్‌గఢ్, ఒడిశా వాసులను తీసుకువచ్చి, రైతుల కోసం నిర్మిస్తోన్న పోలవరం ప్రాజెక్టుకు ఆటంకాలు కలిగించాలని చూస్తున్నారని ఆరోపించారు. అంతేగాక, సుప్రీంకోర్టులో కేసులు వేస్తూ రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారని అన్నారు. పోలవరం ప్రాజక్టును అడ్డుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.