: ట్రంప్ గెలిస్తే అమెరికా వదిలి వెళ్లిపోతా: హాలీవుడ్ నటుడు హాల్డర్
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ను వ్యతిరేకిస్తున్న హాలీవుడ్ ప్రముఖుల జాబితా అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా ఆ లిస్టులోకి నటుడు, మోడల్, దర్శకుడు ఇయాన్ జోసఫ్ సోమర్ హాల్డర్ కూడా చేరాడు. నవంబర్ 8న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎంతో కీలకమైనవని... మానవ చరిత్రలోనే ఇవి అత్యంత కీలకమైన ఎన్నికలని చెప్పాడు. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధిస్తే... తాను అమెరికా వదిలి వెళ్లిపోతానని స్పష్టం చేశాడు. అమెరికా అంటే తనకు చాలా ఇష్టమని... తన పిల్లలు కూడా అమెరికాలోనే పెరగాలని కోరుకుంటున్నానని హాల్డర్ తెలిపారు. అయితే, భవిష్యత్తులో ఏం జరగబోతోందో చెప్పలేనని అన్నాడు. ఈ దేశం నుంచి తాను ఏదీ ఆశించడం లేదని... కానీ, ఈ దేశానికి మంచి జరగాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పాడు.