: ట్రంప్ గెలిస్తే నాకు తీవ్ర మనోవేదనే!: సంచలన వ్యాఖ్యలు చేసిన ఒబామా


అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల తరఫున పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే తనకు తీవ్ర మనోవేదనేనని అధ్యక్షుడు బరాక్ ఒబామా సంచలన వ్యాఖ్యలు చేశారు. అత్యంత ధనవంతుల్లో ఒకరైన ట్రంప్ కు ఎట్టి పరిస్థితుల్లోనూ అధ్యక్షుడయ్యే అర్హత లేదని అన్నారు. ట్రంప్ తన పట్ల చేసిన విమర్శలకు ఎలాంటి బాధా లేదని, అయితే, దేశ భవిష్యత్తు అతని చేతుల్లోకి వెళుతుందన్న ఆలోచన వస్తేనే ఆందోళనగా ఉందని చెప్పారు. రిపబ్లికన్లు, డెమోక్రాట్ల మధ్య ఎన్నో విషయాల్లో విభేదాలు ఉండటం సహజమేనని అన్నారు. డొనాల్డ్ ట్రంప్ తో పోలిస్తే, అతని పార్టీలో ఎంతో మంది మెరుగైన నేతలున్నారని అన్నారు. దేశానికి సమస్యలు, సవాళ్లు ఎదురవుతుంటే వాటిని దాటుకుంటూ ముందుకు సాగాలని, అటువంటిది అధ్యక్షుడే ఓ సమస్యగా మారే పరిస్థితి వచ్చిందని, దీన్ని అడ్డుకోవాలని ఒబామా పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News