: షాకింగ్... పేలిన రిలయన్స్ జియో లైఫ్ స్మార్ట్ ఫోన్... చిత్రాలు వైరల్!


4జీ తరంగాలను ఉచితంగా అందిస్తూ, శరవేగంగా విస్తరిస్తున్న రిలయన్స్ జియోకు బ్రేకులు వేసే వార్తిది. తాను వాడుతున్న లైఫ్ బ్రాండ్ 4జీ ఫోన్ ఒక్కసారిగా పేలిందని చెబుతూ, తన్వీర్ సాధిక్ అనే యువకుడు తన ట్విట్టర్ ఖాతాలో పెట్టిన పోస్టు వైరల్ అయింది. తన కుటుంబం తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుందని చెబుతూ, పేలిన రిలయన్స్ జియో లైఫ్ ఫోన్ చిత్రాలను ఆయన చూపారు. దీనిపై జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించడంతో సోషల్ మీడియాలో ఈ ట్వీట్ మరింతగా దూసుకెళుతోంది. విషయం తెలుసుకున్న రిలయన్స్, ఫోన్ పేలిన విషయంలో పూర్తి విచారణ జరిపించనున్నట్టు ప్రకటించింది.

  • Loading...

More Telugu News