: చైనా సైనికులు చూస్తుండగానే పైప్‌లైన్‌ను పూర్తిచేసిన భారత్.. డ్రాగన్ కంట్రీకి మైండ్ బ్లాంక్!


చైనాకు భారత్ షాకిచ్చింది. లడఖ్ డివిజన్‌లోని గ్రామాల ప్రజలకు సాగు, తాగు నీరు అందించేందుకు చేపట్టిన పైప్‌లైన్ పనులు చైనా సైనికులు చూస్తుండగానే ఆర్మీ ఇంజినీర్లు పూర్తిచేశారు. లడఖ్‌లోని దెమ్‌చోక్‌లో భారత ఆర్మీ పైప్‌లైన్ నిర్మాణపనులను చేపట్టింది. అయితే రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఇక్కడ రక్షణ అవసరాలకు తప్ప మరే ఇతర నిర్మాణలు చేపట్టకూడదని పేర్కొంటూ చైనా పీపుల్స్ ఆర్మీ ఈనెల 2న పనులను అడ్డుకునేందుకు ప్రయత్నించింది. ఆ ప్రాంతంలో సైనికులను మోహరించింది. దీంతో స్పందించిన భారత సైన్యం కూడా సైనికులను మోహరించి వారిని నిలువరించింది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు దేశాల సైనికులు మూడు రోజులుపాటు అలాగే ముఖాముఖి నిల్చోవడంతో పరిస్థితి అదుపు తప్పినట్టు కనిపించింది. చైనా ఆర్మీని విజయవంతంగా నిలువరించిన మన సైనికులు వారు చూస్తుండగానే పైప్‌లైన్ నిర్మాణ పనులను విజయవంతంగా పూర్తి చేయడంతో చైనాకు దిమ్మదిరిగింది. 2014లో ఉపాధి హామీ పథకం కింద నీలుంగ్ నల్లా కెనాల్ వద్ద సూక్ష్మ తరహా సాగునీటి ప్రాజెక్టు చేపట్టిన సమయంలోనూ ఇటువంటి ఉద్రిక్తతే చోటుచేసుకుంది.

  • Loading...

More Telugu News