: భారతీయులపై మళ్లీ కంపు వ్యాఖ్యలు చేసిన ట్రంప్


రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారు. ఇటీవల తన ఎన్నికల ప్రచారంలో హిందువులకు తాను వీరాభిమానిని అంటూ ఊదరగొట్టిన ట్రంప్.... అమెరికన్ కంపెనీల ఉద్యోగాలను భారత్, చైనా, మెక్సికో, సింగపూర్ వాసులు తన్నుకుపోతున్నారని తాజాగా వ్యాఖ్యానించారు. ఈ సంక్షోభానికి బిల్ క్లింటన్, హిల్లరీ క్లింటన్ లే కారణమని ఆరోపించారు. టంపా, ఫ్లోరిడాలలో ప్రసంగిస్తూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గుడ్ రిచ్ లైటింగ్ సిస్టమర్స్ 255 మంది ఉద్యోగులను తొలగించి, ఆ ఉద్యోగాలను భారత్ కు తరలించిందని విమర్శించారు. బాక్స్టర్ హెల్త్ కేర్ కార్పొరేషన్ 199 మంది ఉద్యోగులను తొలగించి, ఆ ఉద్యోగాలను సింగపూర్ కు తరలించిందని చెప్పారు. ఈ ఎన్నికల్లో తాను గెలిస్తే, ఇప్పటి వరకు అమెరికా నుంచి తరలిపోయిన ఉద్యోగాలను మళ్లీ వెనక్కి తెప్పిస్తానని హామీ ఇచ్చారు. ఫ్లోరిడాలో ప్రతి నాలుగు ఉద్యోగాల్లో ఒక ఉద్యోగాన్ని మనం కోల్పోతున్నామని ట్రంప్ చెప్పారు. దీనికింతటికీ కారణం బిల్ క్లింటన్ కుదిర్చిన నార్త్ అమెరికన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంటేనని తెలిపారు. ఉద్యోగాలను వెనక్కి తెచ్చే క్రమంలో, అమెరికన్ బిజినెస్ లకు తక్కువ పన్నులు విధిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News