: కామన్‌వెల్త్‌లో భారత కుస్తీ వీరుల ‘బంగారు’ వేట.. 8 స్వర్ణాలు, 8 రజతాలు కొల్లగొట్టిన మల్లయోధులు


ఢిల్లీలో జరుగుతున్న కామన్‌వెల్త్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత కుస్తీ వీరులు పతకాల వేటలో దూసుకుపోతున్నారు. ఆదివారం జరిగిన పోటీల్లో వివిధ విభాగాల్లో ఏకంగా 8 బంగారు, 8 రజత పతకాలు కొల్లగొట్టారు. ఫ్రీస్టయిల్‌లో హర్‌పుల్, భజరంగ్, జితేందర్, సందీప్, దీపక్ అరుణ్, గ్రీకో రోమన్‌లో రవీందర్ కృష్ణన్, సచిన్ బంగారు పతకాలు కైవసం చేసుకున్నారు. మొత్తంగా కామన్‌వెల్త్‌లో 16 పతకాలను భారత ఆటగాళ్లు సొంతం చేసుకున్నారు. కాగా నాలుగు విభాగాల్లో భారత రెజర్ల మధ్యే ఫైనల్ పోరు జరగడం విశేషం.

  • Loading...

More Telugu News