: కామెడీ ఆర్టిస్ కు ఎక్కువ, విలన్ కు తక్కువ!: లోకేష్ పై సెటైర్లు వేసిన రోజా


ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షం లేదని నారా లోకేష్ వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని వైకాపా మహిళా నేత రోజా వ్యాఖ్యానించారు. లోకేష్ మాటలు చూస్తుంటే, ఆయన అవగాహనా రాహిత్యం ఏ స్థాయిలో ఉందో ఇట్టే తెలిసిపోతుందని ఆమె అన్నారు. లోకేష్ కామెడీ నటుడికి ఎక్కువ, కామెడీ చేసే విలన్ కు తక్కువ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఎంపీలతో రాజీనామాలు చేయించేందుకు సిద్ధమని జగన్ స్పష్టం చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ, టీడీపీ ఎంపీలతో చంద్రబాబు కూడా రాజీనామా చేయిస్తారా? అని ప్రశ్నించారు. వైకాపా నుంచి కలుపుకున్న 20 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి తిరిగి గెలిపించుకోవాలని సవాల్ విసిరారు.

  • Loading...

More Telugu News