: కిటకిటలాడుతున్న శివాలయాలు.. కార్తీక సోమవారం కావడంతో పోటెత్తుతున్న భక్తులు
కార్తీక సోమవారం సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులతో పంచారామాలు పోటెత్తాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. భక్తుల కోసం సోమేశ్వర, క్షీర రామలింగేశ్వరస్వామి ఆలయాల్లో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గోష్పాదక్షేత్రం, వలందరరేవుల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయం, తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ ఆలయం, యాదాద్రి జిల్లాలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. రాజరాజేశ్వరస్వామి, లక్ష్మీనరసింహస్వామి వారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. భక్తుల రద్దీ నేపథ్యంలో యాదాద్రి కొండపైకి వాహనాలను అనుమతించడం లేదు.