: చంద్రబాబుకు ‘దావోస్’ ఆహ్వానం.. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనాలని పిలుపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి దావోస్ నుంచి ఆహ్వానం అందింది. జనవరి 17 నుంచి 20 వరకు అక్కడ జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో పాల్గొనాలంటూ పిలుపు వచ్చింది. దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక 47వ వార్షిక సదస్సులో పాల్గొనాల్సిందిగా వేదిక మేనేజ్‌మెంట్ బోర్డు మెంబర్ ఫిలిప్ రోజియర్ సీఎంకు లేఖ రాశారు. ప్రస్తుతం జెనీవా పర్యటనలో ఉన్న ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి ముఖ్య కార్యనిర్వహణాధికారి జాస్తి కృష్ణకిషోర్‌ను స్వయంగా కలిసిన ఆర్థిక వేదిక ఉన్నతాధికారులు ఆహ్వాన లేఖను అందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఓసారి, ప్రతిపక్ష నేతగా మరోసారి దావోస్ సదస్సులో పాల్గొన్న చంద్రబాబు, ఏపీ సీఎం హోదాలో ఇప్పుడు మరోసారి దావోస్ సదస్సుకు హాజరుకానున్నారు.