: ఇరాక్ లో ఆత్మాహుతి దాడులు.. 21 మంది మృతి
ఇరాక్ లో మళ్లీ ఆత్మాహుతి దాడులు జరిగాయి. టిక్రిత్, సమారా ప్రాంతాల్లో జరిగిన రెండు ఆత్మాహుతి దాడుల్లో 21 మంది మృతి చెందారు. అంబులెన్స్ లో వచ్చిన ముష్కరులు టిక్రిత్ లోని రద్దీ ప్రాంతంలో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. అయితే, ఈ దాడి జరిగిన కొద్ది సేపటికే, సమారాలోని కార్ పార్కింగ్ వద్ద కూడా ఇదే తరహాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో మరో 8 మంది మృతి చెందారు. ఈ రెండు సంఘటనల్లో వందలాది మంది గాయపడ్డారు. ఉద్రిక్త పరిస్థితుల కారణంగా టిక్రిత్, సమారా ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.