: ‘నువ్వు కూడానా చంద్రబాబూ?’ అంటూ రాష్ట్రం మొత్తం నివ్వెరపోతోంది: జగన్


రోమన్ రాజకీయ వేత్త అయిన జూలియన్ సీజర్ ను వెన్నుపోటు పొడిచిన ఆయన నమ్మిన బంటు బ్రూటస్ సంఘటనను ‘జైఆంధ్ర ప్రదేశ్’ సభలో వైఎస్ జగన్ ప్రస్తావించారు. ఈ సంఘటనను ఏపీ సీఎం చంద్రబాబుకు, రాష్ట్ర ప్రజలకు పోల్చుతూ చెప్పారు.‘జూలియస్ సీజర్ ను వెనుక నుంచి ఆయన నమ్మినబంటు బ్రూటస్ కత్తితో పొడిచాడు. ఆ సందర్భంలో, సీజర్ ‘బ్రూటస్.. యు టూ’ అన్నాడు. అంటే, బ్రూటస్ నువ్వు కూడా ‘నమ్మక ద్రోహం చేస్తావా?’ అని అర్థం. ఈ రోజున అదే పరిస్థితి ఏపీలో జరుగుతోంది. ఎలా అంటే... ప్రత్యేక హోదా కావాలని కోరుతున్న ప్రజలను చంద్రబాబు కూడా అదేమాదిరి వెన్నుపోటు పొడిచారు. ‘చంద్రబాబూ, నువ్వు కూడా నమ్మకద్రోహం చేస్తావా?’ అంటూ ప్రజలు బాధపడుతున్నారు’ అని జగన్ చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News