: విద్యాసంస్థలను తగులబెట్టడంపై స్పందించిన ఎంపీ అసదుద్దీన్
జమ్మూకాశ్మీర్ లో విద్యాసంస్థలను తగులబెట్టడంపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఇటువంటి సంఘటనలకు పాల్పడే వారు ఒక్క కాశ్మీర్ కే కాదు యావత్తు మానవాళికే ప్రమాదమని, శత్రువులని అన్నారు. ఇటువంటి వారిని తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కాగా, ఉగ్రవాది బుర్హాన్ వనీని భారత్ ఆర్మీ హతమార్చినప్పటి నుంచి జమ్మూ కాశ్మీర్ లో విద్యా సంస్థలపై ఆందోళన కారులు విరుచుకుపడుతున్నారు.