: నల్ల ధనాన్ని తెల్లధనంగా ఎలా మార్చుకోవాలో ఆయన దగ్గరే నేర్చుకోవాలి: జగన్
నల్ల ధనాన్ని తెల్లధనంగా ఎలా మార్చుకోవాలనే విషయం చంద్రబాబు దగ్గర నుంచే నేర్చుకోవాలని వైఎస్ జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విశాఖలో ‘జై ఆంధ్రప్రదేశ్’ సభలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు కుటుంబానికి చెందిన ‘హెరిటేజ్’ సంస్థ షేర్ ధర ఒకప్పుడు మామూలుగా ఉండేదని, ఈ రోజున ఆ సంస్థ షేర్ ధర 450 రెట్లకు పెరిగిపోయిందని విమర్శించారు. దేశం మొత్తంమీద చూస్తే అత్యాచార నిందితుల్లో నలుగురు మంత్రి పదవుల్లో ఉన్నారని, అందులో ఇద్దరు మంత్రులు మన రాష్ట్రం నుంచే ఉండటం ‘మన కర్మ’ అంటూ జగన్ వ్యాఖ్యానించారు. సువర్ణాంధ్ర ప్రదేశ్ సంగతి దేవుడెరుగు, మద్యాంధ్రప్రదేశ్, అవినీతాంధ్రప్రదేశ్ గా ఈ రాష్ట్రాన్ని మారుస్తున్న చంద్రబాబును జైల్లో పెట్టినా తప్పులేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.