: చంద్రబాబు రెండున్నరేళ్ల పాలనలో ఎవరు సంతోషంగా ఉన్నారు?: జగన్


‘చంద్రబాబు రెండున్నరేళ్ల పాలనలో ఎవరు సంతోషంగా ఉన్నారు?’ అని తాను ప్రశ్నిస్తున్నానని వైఎస్సార్సీపీ అధినేత జగన్ సూటిగా ప్రశ్నించారు. ఏ ప్రశ్నకూ సమాధానం చెప్పలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని అన్నారు. రాష్ట్రంలో రైతులు, డ్వాక్రా మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగ యువత, కార్మికులు, కూలీలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు...ఎవ్వరూ చంద్రబాబు పాలనలో సంతోషంగా లేరన్నారు. కనీసం, ఎన్నికల హామీలను కూడా నెరవేర్చలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని ఆరోపించారు. రాష్ట్ర విభజన జరిగి రెండున్నరేళ్లు అయిన తర్వాత కూడా నష్టాల బాటలోనే ఉంది, రెండున్నరేళ్లలో ఒక్క భారీ పరిశ్రమైనా రాష్ట్రానికి వచ్చిందా? అని జగన్ ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News