: ప్రత్యేకహోదాపై మోసం చేస్తున్న ముసలి నాయకుడు చంద్రబాబు: ఎమ్మెల్యే రోజా
‘పోరాడితే పోయేది లేదు బానిస సంకెళ్లు తప్ప’ అన్న మహాకవి శ్రీశ్రీ నడియాడిన నేల ఇది అంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా తన ప్రసంగాన్ని ప్రారంభించారు. విశాఖపట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరుగుతున్న ‘జైఆంధ్రప్రదేశ్’ బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ, గురజాడ వంటి మహాకవి నడిచిన నేల ఇది అని అన్నారు. బాబు పాలనలో ఒక్క పరిశ్రమ కూడా రాలేదని, ఆయన పాలనలో యువత మోసపోయారని అన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా ఉద్యమంలో కనుక పాల్గొనకపోతే భవిష్యత్ లో నష్టపోతారని అన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా అనేది సంజీవని అని, ఈ విషయంలో రాష్ట్ర ప్రజలను ముసలి నాయకుడు చంద్రబాబు మోసం చేస్తున్నారని ఘాటుగా విమర్శించారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, చంద్రబాబు నాయుడులిద్దరూ కలిసి రాష్ట్రానికి మోసం చేస్తున్నారంటూ రోజా మండిపడ్డారు.