: చిరంజీవి కాంగ్రెస్ పార్టీకే అంకితం: రఘువీరారెడ్డి
చిరంజీవి కాంగ్రెస్ పార్టీ వీడుతున్నారంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ, చిరంజీవి శేష జీవితం మొత్తం కాంగ్రెస్ పార్టీకే అంకితమన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీపై విమర్శలు కురిపించారు. టీడీపీ అవినీతిలో కూరుకుపోయిందని, ఆ పార్టీ చేపడుతున్న యాత్రలు ప్రజలు లేక వెలవెల పోతున్నాయన్నారు. ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం లేదన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా విషయమై తాము అన్ని పార్టీలతో కలిసి పోరాడుతున్నామన్నారు.