: చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా టీడీపీ జెండా ఎగరదు: కొడాలి నాని


టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్ని కుట్రలు చేసినా గుడివాడలో ఆ పార్టీ జెండా ఎగరదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. ప్రజలే దేవుళ్లని, తన గొంతులో ప్రాణమున్నంత వరకు గుడివాడలో వైఎస్సార్సీపీ జెండానే ఎగురుతుందని అన్నారు. తాను ప్రజలను నమ్ముతానని, నాయకులను కాదని అన్నారు. కాగా, వైఎస్సార్సీపికి చెందిన గుడివాడ మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు తాజాగా టీడీపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కొడాలి నాని ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News