: సీతారామశాస్త్రిగారు వదిలేసిన అవకాశం అది!: పాటల రచయిత భాస్కరభట్ల
‘మన ఊరి రామాయణం’ చిత్రంలోని ‘వచ్చిపోవే ఒక్కసారికి, ఉక్కపోత ఉత్సవానికి’ అనే పాట రాసినప్పుడు ప్రకాష్ రాజు చాలా సంతోషపడ్డారని ప్రముఖ పాటల రచయిత భాస్కరభట్ల అన్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి తమ గురువు గారని, ‘మన ఊరి రామాయణం’ చిత్రంలో పాటలు రాయడానికి ఆయనకు వీలులేకనో, లేక అవకాశం చిక్కకపోవడం వల్లనో ఈ చిత్రంలో పాటలు ఆయన రాయలేదని, ఆయన వదిలేసిన అవకాశమే తనకు లభించిందని అన్నారు. అంతేతప్పా, సీతారామశాస్త్రి స్థానాన్ని తాను రిప్లేస్ చేశానని అనుకోవడం కరెక్టు కాదన్నారు. ప్రకాష్ రాజ్ త్వరలో ఒక కొత్త చిత్రాన్ని రూపొందించనున్నారని, ఆ చిత్రంలో కూడా తాను పాటలు రాసే అవకాశముందని అన్నారు.