: టీడీపీలో చేరిన గుడివాడ మున్సిపల్ చైర్మన్ యలవర్తి
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో గుడివాడ మున్సిపల్ చైర్మన్, వైఎస్సార్సీపీ నేత యలవర్తి శ్రీనివాసరావు ఆ పార్టీలో చేరారు. ఆయనతో పాటు 9 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. కాగా, గుడివాడ పురపాలక సంఘంలో వైఎస్సార్సీపీకి 21 మంది సభ్యులు, టీడీపీ కి 15 మంది సభ్యులు ఉన్నారు. అయితే, వైఎస్సార్సీపీ కౌన్సిలర్ గణపతి లక్ష్మణరావు ఇటీవల మృతి చెందడంతో వారి సంఖ్య 20గా ఉంది. తాజాగా కౌన్సిలర్ల పార్టీ ఫిరాయింపుల కారణంగా టీడీపీ కౌన్సిలర్ల సంఖ్య 25కు చేరింది. ఈ నేపథ్యంలో గుడివాడ మున్సిపల్ కౌన్సిల్ టీడీపీ వశం కానున్నట్లు సమాచారం.