: ఒకవేళ నా కూతురు ఆ విషయాన్ని ప్రస్తావిస్తే చాలా భయపడిపోతాను: షాహిద్ కపూర్
‘తాను సినిమా ఆర్టిస్టు అవ్వాలనుకుంటున్నానని నా కూతురు ఒకవేళ చెబితే చాలా భయపడిపోతాను’ అని బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అన్నాడు. ‘మీ కూతురు నటిని అవుతాను అని కనుక చెబితే, మీరు ఎలా ఫీలవుతారు?’ అనే ప్రశ్నకు సమాధానంగా ఆయనలా చెప్పాడు. కాగా, షాహిద్ కపూర్, మీరా దంపతులు తమ ఇద్దరి పేర్లు కలిసి వచ్చేలా తమ ముద్దుల కూతురుకు మిషా అని పేరుపెట్టారు.