: 'ఫ్యామిలీ' అంటూ సమంత పోస్ట్ చేసిన ఆసక్తికర ఫోటో ఇదే!
అక్కినేని నాగార్జున వారసుడు నాగ చైతన్యను వివాహం చేసుకోనున్న హీరోయిన్ సమంత, ఓ ఇంట్రస్టింగ్ ఫోటోను షేర్ చేసుకుంది. పెళ్లికి ఇంకా ఎంతో సమయం ఉన్నప్పటికీ, తన కుటుంబమని చెబుతూ, నాగచైతన్య, అఖిల్, అఖిల్ కు కాబోయే భార్య శ్రేయా భూపాల్, తను కలిసున్న చిత్రాన్ని ఇన్ స్టాగ్రామ్ లో ఉంచింది. ఇటీవల తన జిమ్ వర్క్ అవుట్స్ కు సంబంధించిన ఫోటో, వీడియోలు పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచిన సమంత, తాజా ఫోటో సైతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కాగా, త్వరలో అఖిల్ నిశ్చితార్థం, 2017లో నాగచైతన్య, సమంతల వివాహం జరగనుందన్న సంగతి తెలిసిందే.