: నోయిడా వర్శిటీలో అత్మహత్య చేసుకున్న తెలంగాణ విద్యార్థి


నోయిడాలోని అమిటీ యూనివర్శిటీలో తెలంగాణకు చెంది జి సాయికృష్ణ (21) ఆత్మహత్యకు పాల్పడటం కలకలం సృష్టించింది. ఫెసిలిటీస్ మేనేజ్ మెంట్ లో పీజీ డిప్లమో తొలి సంవత్సరం చదువుతున్న కృష్ణ, తన రూమ్ లోని ఇతర విద్యార్థులు దీపావళి పండగకు స్వగ్రామాలకు వెళ్లిన వేళ, ఆత్మహత్యకు పాల్పడ్డాడని సెక్టార్ 39 పోలీస్ స్టేషన్ అధికారి అమర్నాథ్ యాదవ్ వెల్లడించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన సాయి కృష్ణను కొన్ని రోజుల క్రితం అతని తండ్రి గండ్ర దీనదయాళ్‌ రెడ్డి మందలించారు. చదువులో వెనుకబడి వుండటంతో పాటు ఖర్చులు పెంచుకోవడం, ఇతరుల వద్ద అప్పులు తీసుకోవడాన్ని తప్పుబట్టారు. దీనిపై నొచ్చుకున్న కృష్ణ, తెలుగులో లేఖను రాసి, ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్య అంత సులభమేమీ కాదని, తన తల్లిదండ్రులు తనకోసం ఎంతో చేశారని చెప్పుకొచ్చాడు. కేసును విచారిస్తున్నామని, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో సత్తుపల్లిలో విషాదం నెలకొంది.

  • Loading...

More Telugu News