: త్రివిక్రమ్ బర్త్ డే కానుక... మాటల మాంత్రికుడి పేరిట ఆండ్రాయిడ్ యాప్!
తెలుగు సినీ పరిశ్రమలో మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకుని ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 7న ఆయన పేరిట ఓ స్పెషల్ మొబైల్ యాప్, వెబ్ సైట్ 'www.trivikramcelluloid.in'ను ప్రారంభిస్తున్నట్టు ఏబీసీ డిజిటల్ మీడియా వెల్లడించింది. త్రివిక్రమ్ అభిమానులు ఒకేచోట చేరి ఒక్క క్లిక్ తో ఆయన చిత్రాలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని తెలుసుకునేలా ఇవి వుంటాయని ఏబీసీ డిజిటల్ ప్రతినిధి రాహుల్ వెల్లడించారు. ఆండ్రాయిడ్ ఆధారత స్మార్ట్ ఫోన్లపై ఈ యాప్ పనిచేస్తుందని ఆయన అన్నారు. రేపటి నుంచి గూగుల్ ప్లే స్టోర్ లో ఈ యాప్ అందుబాటులో ఉంటుందని, అప్ డేట్స్ ను నోటిఫికేషన్ మెసేజ్ విధానంలో వినియోగదారులకు అందిస్తామని రాహుల్ తెలిపారు.