: ఇక వద్దనుకున్న లాటరీ రూ. 6.68 కోట్లిచ్చింది!


నిత్యమూ లాటరీ టిక్కెట్లు కొని డబ్బు తగలేస్తున్న భర్త మనసు మార్చేందుకు ఆ భార్య చేసిన పనికి లక్ష్మీదేవి కరుణించింది. ఎన్నో ఏళ్లుగా భర్త కొన్న లాటరీలకు తగలని అదృష్టం, అతన్ని మార్చేందుకు తన డబ్బు పెట్టి కొన్న టికెట్లకు దక్కింది. అమెరికాలోని నార్త్ కరోలినాలో, టికెట్లతో డబ్బు దండగ తప్ప మరో లాభం లేదని భర్తకు తెలిసొచ్చేలా చేయాలని గ్లెండా బ్లాక్ వెల్ కొన్ని టికెట్లు కొని వాటిని భర్త చేతిలో ఉంచి గొడవ పెట్టుకుంది. మరోసారి ఇటువంటి ఉపయోగం లేని పనులు చేయవద్దని వేడుకుంది. ఆమె ఊహించని విధంగా లాటరీలో 10 లక్షల డాలర్లు (సుమారు రూ. 6.68 కోట్లు) లాటరీ తగిలింది. దీంతో ఉబ్బితబ్బిబ్బైపోయిన ఆమె, తనకు చాలా సంతోషంగా ఉందని, ఇకపై భర్తను కోప్పడబోనని చెబుతోంది. ఓ ఇల్లు, కొంత భూమి కొనుగోలు చేసి, మనవరాళ్ల చదువులకు కొంత కేటాయిస్తానని చెబుతున్న గ్లెండా, భవిష్యత్ ప్లాన్లు వేవే పనిలో నిమగ్నమైవుందిప్పుడు.

  • Loading...

More Telugu News