: మన 'నాగా' అసంతృప్తిగా ఉంటే, దేశానికి సిగ్గు చేటు: రాజ్ నాథ్ సింగ్
ఈశాన్య రాష్ట్రాల నుంచి ముఖ్యంగా నాగాలాండ్ నుంచి దేశ రాజధానికి వచ్చి ఉంటున్న వారి ప్రయోజనాలను కాపాడేందుకు మరింత కృతనిశ్చయంతో ఉన్నామని హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో నాగా స్టూడెంట్స్ యూనియన్ 53వ వార్షిక సమావేశాలు జరుగగా, ఆయన పాల్గొని ప్రసంగించారు. "మన నాగా సోదర సోదరీమణులు అసంతప్తిగా ఉంటే ఇండియా సంతోషంగా ఉండబోదని నాకు తెలుసు. వారి భద్రతకు ఏదైనా విఘాతం ఏర్పడితే, అది జాతికి సిగ్గుచేటు. నాగా ప్రజలు పూర్తి గౌరవంతో ఎక్కడైనా ఉండొచ్చు. ఆ పరిస్థితులు కల్పించాలి" అన్నారు. ఢిల్లీ పోలీసులు ఈశాన్య రాష్ట్రాల నుంచి 450 మందిని రిక్రూట్ చేసుకున్నారని ఆయన గుర్తు చేశారు. ఏవైనా భద్రతా పరమైన సలహాలు ఇవ్వాలని భావిస్తే, నాగాల్యాండ్ యువత తన నోటీసుకు తీసుకురావాలని కోరారు. ఏ అంశం తన దృష్టికి వచ్చినా, తగిన చర్యలు వెంటనే తీసుకుంటానని తెలిపారు. తనకు జూనియర్ గా ఈశాన్య యువత సమస్యలను అర్థం చేసుకునే కిరణ్ రిజిజు ఉన్నారని రాజ్ నాథ్ తెలిపారు.