: కాశ్మీర్ లోయలో వేర్పాటువాదులపై యువత వ్యతిరేకత


కాశ్మీర్ లోయలో పదుల సంఖ్యలో పాఠశాలలను దహనం చేయడంపై విద్యార్థి యువత తీవ్రంగా స్పందిస్తోంది. "మా స్కూళ్ల వద్ద భద్రతను మరింతగా పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. విద్యాలయాలు మాకు మసీదుల వంటివి. స్కూళ్ల దహనాన్ని వెంటనే ఆపాలి" అని ఓ విద్యార్థి డిమాండ్ చేశాడు. దేవాలయం, మసీదుకన్నా పాఠశాలలే గొప్పవన్న మరో విద్యార్థి, విద్యతోనే ఉన్నతమైన భవిష్యత్తు దిశగా సాగవచ్చని, స్కూళ్లలో సెక్యూరిటీ పెంచాలని కోరారు. కాశ్మీర్ లో ఎంతో మంది నైపుణ్యవంతులైన యువత ఉందని, ఐఏఎస్ వంటి పరీక్షలు సైతం రాసి విజయవంతమైన వాళ్లు ఎందరో ఉన్నారని గుర్తు చేసిన ఓ స్థానిక టీచర్, విద్యా వ్యవస్థ స్తంభిస్తే, అది భవిష్యత్తుకు చేటని, వేర్పాటు వాదుల నేతృత్వంలో జరుగుతున్న తాజా పాఠశాల దహనాలు చాలా దురదృష్టకరమని, బయటి ప్రపంచానికి తప్పుడు సంకేతాలు పంపుతున్నాయని అన్నారు. కాగా, కాశ్మీర్ ప్రాంతంలో ఇప్పటివరకూ 32 స్కూళ్లను గుర్తు తెలియని వ్యక్తులు లక్ష్యంగా చేసుకుని వాటిని దహనం చేశారు. జూలై 8న హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది బుర్హాన్ వనీ ఎన్ కౌంటర్ అనంతరం, నిరసనలు మొదలుకాగా, ఇప్పటివరకూ పాఠశాలలు తెరచుకోలేదన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News