: ఢిల్లీ గ్యాస్ చాంబర్ లా వుంది... తక్షణం కల్పించుకోవాలని మోదీకి కేజ్రీవాల్ విజ్ఞప్తి!


ఢిల్లీలో కమ్ముకున్న పొగమంచు ప్రజల ప్రాణాలకు ప్రమాదకరంగా మారడంతో, కేంద్ర ప్రభుత్వం కల్పించుకోవాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. పొరుగున ఉన్న పంజాబ్, హర్యానాల్లో పంట పొలాల్లో కట్టెలను తగులబెడుతున్న కారణంగానే ఢిల్లీ ఓ గ్యాస్ చాంబర్ లా మారిందని, ప్రధాని వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కేజ్రీవాల్ కోరారు. కేవలం వాహనాల వల్లే కాలుష్యం ఏర్పడలేదని వెల్లడించిన ఆయన, సరి- బేసి విధానం అమలు చేస్తే కాలుష్యం తగ్గే అవకాశాలు లేవని అన్నారు. పంజాబ్, హర్యానాలు చర్యలు చేపట్టి, రైతులను కొంతకాలం నిలువరించాలని కోరారు. ఢిల్లీ బయటి ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాలతోనే కాలుష్యం పెరుగుతోందని, అది ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిందని అన్నారు. స్కూళ్లను ఇప్పటికే దీర్ఘకాలం పాటు మూసివుంచామని, పాఠశాలలను తిరిగి తెరవకుంటే, విద్యార్థులు నష్టపోతారని అన్నారు. కేంద్రం మనస్ఫూర్తిగా సహకరిస్తే, సమస్య నుంచి వీలైనంత త్వరగా బయటపడవచ్చని కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News