: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 158 సీట్లతో వైకాపా విజయభేరి: సర్వే వివరాలు తెలిపిన విజయసాయిరెడ్డి
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని రాజ్యసభ సభ్యుడు, వైకాపా ప్రధాన కార్యదర్శి పి.విజయసాయిరెడ్డి అన్నారు. ఇటీవల జరిగిన కొన్ని సర్వేల్లో ఈ విషయం వెల్లడైందని చెప్పిన ఆయన, 2014 ఎన్నికల్లో టీడీపీ, వైకాపాల మధ్య ఒక్క శాతం ఓట్ల తేడానే నమోదైందని గుర్తు చేశారు. గత ఎన్నికల్లో టీడీపీకి 45 శాతం, వైకాపాకు 44 శాతం ఓట్లు వచ్చాయని, ఇప్పుడు టీడీపీ బలం 15 శాతానికి పడిపోయిందని అన్నారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీకి 158 నుంచి 160 సీట్లు వస్తాయని సర్వేలో తేలినట్టు వెల్లడించారు. తమ పార్టీ విజయభేరి మోగిస్తుందని అన్నారు. గత రెండేళ్లలో తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం కాకుండా, స్వార్థం కోసం పనిచేసిందని ఆరోపించారు.