: తెలంగాణకు ప్రత్యేక హోదా.. ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టనున్న ఎంపీ వినోద్ కుమార్


తెలంగాణకు ప్రత్యేక హోదా, ఆర్థిక సాయం ప్రకటించాలని కోరుతూ టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ లోక్‌సభలో ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. గతేడాది లోక్‌సభ సచివాలయానికి తన బిల్లును అందించినట్టు వినోద్ కుమార్ తెలిపారు. వచ్చే సమావేశాల్లో లోక్‌సభ బ్యాలెట్ లాటరీలో ఆ బిల్లును ప్రవేశపెట్టడానికి అనుమతి లభించినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న సమావేశాల్లో ఆయన బిల్లు పెట్టే అవకాశం ఉంది. ఈనెల 18 లేదంటే డిసెంబరు 2న సభలో బిల్లును ప్రవేశ పెట్టేందుకు దరఖాస్తు చేసుకోవాలని కోరుతూ లోక్‌సభ అధికారులు ఎంపీకి సమాచారమిచ్చారు.

  • Loading...

More Telugu News