: వైకాపాకు హ్యాండిచ్చిన గుడివాడ మునిసిపల్ చైర్మన్... ఏడుగురు కౌన్సిలర్లు సహా టీడీపీలోకి యలవర్తి


కృష్ణా జిల్లా గుడివాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మునిసిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, ఏడుగురు కౌన్సిలర్లు సహా చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. వారి ఫిరాయింపునకు చంద్రబాబు పచ్చజెండా ఊపడంతో మరికాసేపట్లో యలవర్తి బ్యాచ్ టీడీపీ కండువాలను కప్పుకోనుంది. ఆపై గుడివాడ పురపాలక కౌన్సిల్ సైతం తెలుగుదేశం పార్టీ కైవసం అవుతుందని ఆ పార్టీ నేతలు సంతోషంగా ఉన్నారు. ప్రస్తుతం మునిసిపాలిటీలో వైకాపాకు 21, తెదేపాకు 15 మంది సభ్యుల బలం ఉండగా, యలవర్తి బ్యాచ్ టీడీపీలో చేరితే, తెలుగుదేశం బలం 23కు పెరగనుంది.

  • Loading...

More Telugu News