: నవంబర్ లో జరిగే ఖగోళ అద్భుతాలివి!


ఈ నవంబరులో ఆకాశంలో పలు అద్భుతాలు జరగనున్నాయని ఖగోళ శాస్త్రజ్ఞులు వెల్లడిస్తున్నారు. సాధారణ పున్నమి చంద్రలకన్నా కార్తీక పౌర్ణమి నాటి చంద్రుడు మరింత పెద్దగా కనిపిస్తాడని అందరికీ తెలిసిందే. ఇక ఈ కార్తీక పున్నమికి సూపర్ మూన్ కనువిందు చేయనుంది. 14వ తేదీన 14 శాతం పెద్దగా, 30 శాతం ఎక్కువ కాంతిమంతంగా చంద్రుడు కనిపించనున్నాడు. భూమికి, చంద్రుడికి మధ్య దూరం గణనీయంగా తగ్గినప్పుడు పెద్దగా కనిపించే చందమామనే సూపర్ మూన్ అంటారు. ఈ శతాబ్దంలో ఇదే పెద్ద సూపర్ మూన్ అని, తిరిగి ఇలాంటి సూపర్ మూన్ ను చూడాలంటే 2034 వరకూ ఆగాల్సిందేనని చెబుతున్నారు. ఇక సూర్యాస్తమయం కాగానే గురు గ్రహాన్ని స్పష్టంగా వీక్షించవచ్చు. 23వ తేదీన అయితే, పక్కపక్కనే శని, బుధ గ్రహాలను, 25న చంద్రుడి పక్కనే ఉండే గురు గ్రహాన్ని చూడవచ్చు. ఇక 11, 17వ తేదీల్లో ఉల్కాపాతం చోటు చేసుకుంటుందని, వందలాది ఉల్కలు భూ వాతావరణంలోకి ప్రవేశించి మండిపోవడాన్ని వీక్షించవచ్చని ఖగోళ శాస్త్రజ్ఞులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News