: మరో భారత్-పాక్ జంటకు సుష్మ సాయం.. వీసా దరఖాస్తు, ఆస్పత్రి వివరాలు పంపాలని ట్వీట్


సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా ప్రజలకు చేరువగా ఉంటూ వారి సమస్యలను తీర్చడంలో ముందుంటున్న విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ మరోసారి సాయంలో ముందు నిలిచారు. భారత్-పాక్ జంటకు ఆపన్న హస్తం అందించేందుకు ముందుకొచ్చారు. దుబాయ్‌లో నివసిస్తున్న యాసిన్ భారతీయుడు. అతడి భార్య పాకిస్థానీ. వారి కుమారుడి చికిత్స కోసం భార్యను ముంబై పంపించాలని యాసిన్ అనుకున్నారు. ఆమెకు భారత వీసా కోసం దరఖాస్తు చేశారు. కుమారుడికి వైద్యం చేయించాలని, తన భార్యకు త్వరగా వీసా మంజూరయ్యేలా చూడాలని కోరుతూ మంత్రి సుష్మాకు ఆయన ట్వీట్ చేశారు. తాను భారతీయ పౌరుడినని, ప్రత్యేక అవసరాలు కలిగిన తన కుమారుడికి ముంబైలో వైద్యం చేయించేందుకు తన భార్య అత్యవసరంగా భారత్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. త్వరగా వీసాకు అనుమతించాలని ట్వీట్ ద్వారా మంత్రిని అభ్యర్థించారు. యాసిన్ ట్వీట్‌కు స్పందించిన సుష్మా.. వీసా కోసం చేసిన దరఖాస్తు వివరాలు సహా ముంబైలోని ఏ ఆస్పత్రిలో చికిత్స చేయించాలనుకుంటున్నారో వివరాలు పంపాలని రీట్వీట్ చేసి సాయంలో తాను ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటానని మరోసారి నిరూపించారు.

  • Loading...

More Telugu News