: హైదరాబాద్‌లో పదో తరగతి విద్యార్థిపై ఆరో తరగతి విద్యార్థి కత్తితో దాడి
హైదరాబాద్‌లోని సనత్‌నగర్ ప్రాంతంలో పదో తరగతి విద్యార్థితో గొడవపడ్డ ఆరో తరగతి విద్యార్థి ఆగ్రహంతో ఊగిపోయి ఈ రోజు కత్తితో దాడికి దిగాడు. ఈ ఇద్దరు బాలురు సనత్‌నగర్ పరిధిలోని జింకలవాడ సమతానగర్ ప్రాంతానికి చెందిన వారుగా తెలుస్తోంది. మూడు రోజుల క్రితం పదో తరగతి విద్యార్థి సదరు ఆరో తరగతి విద్యార్థిని సైకిల్‌తో ఢీకొట్టాడు. దీంతో ఈ ఇద్దరు విద్యార్థుల మధ్య ఘర్షణ చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ దాడి జరిగింది. కత్తిపోట్లకు గురయిన విద్యార్థిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.