: అజిత్‌ ధోవల్‌ చర్చలు ఫలించాయి.. ఉగ్ర‌వాదుల‌పై పోరాటానికి క‌లిసి ప‌నిచేయ‌నున్న‌ భారత్, చైనా


భారత భద్రతా సలహాదారు అజిత్‌ ధోవల్‌, చైనా స్టేట్‌ కౌన్సిలర్‌ యాంగ్‌ జీచిల మధ్య కీలక చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన‌ వివరాలను ఈ రోజు సంబంధిత‌ అధికారులు మీడియాకు తెలిపారు. ప్ర‌ధానంగా ఇరు దేశాల మ‌ధ్య ఉన్న ఉగ్రవాద నిరోధం, ఇతర రంగాల్లో పరస్పర అవగాహనలను కొనసాగించేందుకు ఇరు దేశాలు ప‌చ్చ‌జెండా ఊపాయ‌ని అధికారులు పేర్కొన్నారు. అంతేగాక, ఆర్థిక, రక్షణ, విదేశీ వ్యవహారాలు, జాతీయ, అంతర్జాతీయ వ్య‌వ‌హారాల‌తో పాటు ప‌లు అంశాల‌పై ఇరు దేశాలు ప‌ర‌స్ప‌రం స‌హ‌కారాన్ని కొన‌సాగించుకునేందుకు ఒప్పందాలు జ‌రిగాయ‌ని చెప్పారు. ఉగ్ర‌వాదుల‌పై పోరాటానికి ఇరు దేశాలు క‌లిసి ప‌నిచేయ‌నున్న‌ట్లు అదికారులు తెలిపారు. అయితే, ఎన్‌ఎస్‌జీకి సంబంధించి చర్చించిన అంశాలను అధికారులు చెప్ప‌లేదు. భార‌త్, చైనా ద్వైపాక్షిక స‌త్సంబంధాల్లో భాగంగా ప‌ర‌స్ప‌రం సహకారం అందించుకోవాలని అజిత్‌ ధోవల్‌, యాంగ్ జీచి ఆకాంక్షించిన‌ట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News