: పాఠశాల విద్యార్థినులపై అత్యాచారం నేపథ్యంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర మంత్రి


మహారాష్ట్రలోని బుల్దానాలో ఇటీవ‌ల ఆదివాసీ ఆశ్రమ పాఠశాలలో ఇద్దరు విద్యార్థినులపై ఉపాధ్యాయులే కీచ‌కుల్లా ప్ర‌వ‌ర్తించి అత్యాచారం చేసిన ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ అంశంపై స్పందించిన మహారాష్ట్ర గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి విష్ణు సవారా మీడియా ముందు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. అత్యాచారం వంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయని వ్యాఖ్యానించారు. స‌ద‌రు ఆశ్రమ పాఠశాలను సంద‌ర్శించిన మంత్రి ఆ స్కూలు గుర్తింపును రద్దు చేస్తామని అన్నారు. ఈ కేసులో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టును ఏర్పాటు చేసి వేగంగా విచారణ జరిపిస్తామని చెప్పారు. ఈ సంద‌ర్భంగానే ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, బుల్దానాలో విద్యార్థినులపై అత్యాచారం కేసులో ద‌ర్యాప్తు జ‌రుపుతున్న పోలీసులు ఇప్పటి వరకు 15 మంది నిందితుల‌ని అరెస్టు చేశారు. పాఠ‌శాల‌లో మ‌రికొంత మంది బాలికలపై అత్యాచారాలు జ‌రిగిన‌ట్లు కూడా తెలుస్తోంది.

  • Loading...

More Telugu News