: మొదట్లో చేతులు వణికాయ్... ఆ తర్వాత ఇతరులతో చేసినట్టే ఐశ్వర్యతో చేశా: రణబీర్


'యే దిల్ హై ముష్కిల్' సినిమాలో తనకు జోడీగా ఐశ్వర్యా రాయ్ నటిస్తుందని దర్శకుడు కరణ్ జొహార్ చెప్పగానే ఎగిరి గంతులేశానని యంగ్ హీరో రణబీర్ కపూర్ తెలిపాడు. అయితే, ఆ వెంటనే కొంచెం నిరాశ కలిగిందని... తన పక్కన ఆమె నటిస్తుందా? అనే అనుమానం కలిగిందని చెప్పాడు. సినిమా షూటింగ్ సందర్భంగా ఐశ్వర్యను ముట్టుకోవాల్సి వచ్చినప్పుడు చేతులు వణికాయని... అయితే, చిన్నపిల్లాడిలా వేషాలు వేయొద్దని, సరిగా నటించాలని ఆమె చెప్పిందని రణబీర్ తెలిపాడు. ఆ తర్వాత ధైర్యం వచ్చిందని... ఇతర హీరోయిన్లతో నటించినట్టే ఐశ్వర్యతో కూడా నటించానని చెప్పాడు. ఐశ్వర్య పెద్ద స్టార్ అయినా... ఆ ఫీలింగ్ లేకుండా తనతో నటించిందని కితాబిచ్చాడు. 1999లో విడుదలైన 'ఆ అబ్ లౌట్ చలే' అనే సినిమాకు తాను అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశానని... అందులో ఐశ్వర్య నటించిందని... అప్పట్నుంచే తామిద్దరికీ మంచి స్నేహం ఉందని చెప్పాడు.

  • Loading...

More Telugu News