: గొప్ప మనసు చాటుకున్న అల్లు అర్జున్... చిన్నారి ఆపరేషన్ కు 8 లక్షల ఆర్థిక సాయం


సిల్వర్ స్క్రీన్ పైనే కాదు, రియల్ లైఫ్ లో కూడా హీరోనే అంటూ అల్లు అర్జున్ నిరూపించుకున్నాడు. తన దృష్టికి వచ్చిన ఓ సమస్య పట్ల పెద్ద మనసుతో స్పందించాడు. వివరాల్లోకి వెళ్తే, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంకు చెందిన నాగరాజు, దుర్గా ప్రశాంతిలకు 7 నెలల బాబు ఉన్నాడు. ఆ చిన్నారి కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడు. అభిమానుల ద్వారా ఈ విషయం బన్నీకి తెలియడంతో... వెంటనే అతను స్పందించాడు. తన వంతుగా రూ. 8 లక్షల సాయం చేశాడు. మరోవైపు, ప్రభుత్వం నుంచి కూడా కొంత డబ్బు రావడంతో, ఆ చిన్నారికి విజయవంతంగా ఆపరేషన్ ను నిర్వహించారు. తమ చిన్నారి ప్రాణాలకు కాపాడిన అల్లు అర్జున్ కు నాగరాజు, దుర్గలు కృతజ్ఞతలు తెలియజేశారు.

  • Loading...

More Telugu News