: అమిత్ షా ఓ గల్లీ లీడర్... బ్రిటీష్ తొత్తు ఆరెస్సెస్: జైపాల్ రెడ్డి


బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను గల్లీ లీడర్ అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో బ్రిటీష్ వారికి ఆరెస్సెస్ తొత్తుగా పనిచేసిందని విమర్శించారు. మన దేశానికి జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇద్దరూ రెండు కళ్లలాంటివారని అన్నారు. పటేల్ ను పొగుడుతూ, నెహ్రూను విమర్శించడం సరైన పద్ధతి కాదని తెలిపారు. నెహ్రూ, పటేల్ ఇద్దరూ దాదాపు పదేళ్లు జైలు జీవితం గడిపినా... ఇద్దరి మధ్య ఏనాడూ అభిప్రాయ భేదాలు తలెత్తలేదని చెప్పారు. హైదరాబాద్ నిజాంపై చేపట్టిన సైనిక చర్య పటేల్ ఒక్కరి సొంత నిర్ణయం కాదని... నెహ్రూతో కలసి తీసుకున్న నిర్ణయం అని చెప్పారు. జమ్ముకశ్మీర్ లో పరిస్థితులు దిగజారడానికి ప్రధాని నరేంద్ర మోదీనే కారణమని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News