: ఎస్పీ రజతోత్సవాల్లో కూడా సేమ్ సీన్ రిపీట్


సమాజ్ వాదీ పార్టీలో నెలకొన్న కుటుంబ కలహం ఇప్పట్లో సమసిపోయే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదు. పార్టీ రజతోత్సవాల సందర్భంగా కూడా బాబాయ్, అబ్బాయ్ లు ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు శివపాల్ యాదవ్, ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ లు కత్తులు నూరుకున్నారు. తొలుత శివపాల్ మాట్లాడుతూ, పార్టీ కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని, అవసరమైతే రక్తం ధారపోస్తానని ఆవేశంగా చెప్పారు. ఆ తర్వాత అఖిలేష్ మాట్లాడుతూ, ఎవరూ పరీక్షలకు సిద్ధపడాల్సిన అవసరం లేదని... ఎవరైనా సరే వారు సిద్ధమంటే, తాను కూడా సిద్ధమేనని చెప్పారు. ఈ సందర్భంగా అభిమానులు ఇచ్చిన కత్తిని చేతిలో పట్టుకుని... 'కత్తిని బహుమతిగా ఇచ్చారు, కత్తి అంటూ ఇస్తే దాన్ని తిప్పి తీరుతా' అన్నారు.

  • Loading...

More Telugu News