: ఐసిస్ పేరు పెట్టుకున్నందుకు మూడు నెలల జైలు శిక్ష

తన వైఫై నెట్ వర్క్ కనెక్షన్ కు ఐసిస్ పేరు పెట్టినందుకు మూడు నెలల జైలు శిక్షకు గురయ్యాడు ఓ యువకుడు. వివరాల్లోకి వెళ్లే, ఫ్రాన్స్ లోని డీజన్ పట్టణంలో 18 ఏళ్ల ఓ టీనేజర్ తన వైఫై కనెక్షన్ కు దానిష్21 అనే పేరు పెట్టాడు. అరబిక్ బాషలో ఇస్లామిక్ స్టేట్ కు దానిష్ అనేది మరో అర్థం. ఈ క్రమంలో, పక్కింట్లో ఉన్న మరో వ్యక్తి ఫోన్ కు దానిష్ అనే పేరుతో పాప్-అప్ వచ్చింది. దీంతో, అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు... ఆ టీనేజర్ పై కేసు నమోదు చేసి, కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే, ఆ కుర్రాడికి ఉగ్రవాద సంస్థలతో ఎలాంటి సంబంధం లేదని విచారణలో తేలింది. దీంతో, అతనికి కఠిన శిక్ష విధించకుండా... 100 గంటల పాటు సమాజ సేవ చేయాలంటూ కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలను అతను తిరస్కరించడంతో, మూడు నెలల జైలు శిక్షను విధించింది.

More Telugu News