: రెండో పెళ్లి చేసుకున్న ఎస్సై సస్పెన్షన్
భార్య ఉండగానే మరో పెళ్లి చేసుకున్న ఎస్సైపై వేటు పడింది. వివరాల్లోకి వెళ్తే, కరీంనగర్ త్రీ టౌన్ ఎస్ఐగా పనిచేస్తున్న రఫీక్ ఖాన్ కు ఇంతకు ముందే పెళ్లయింది. కానీ, భార్య ఉండగానే డాక్టర్ అయిన మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో, అతని భార్య కొన్ని రోజుల క్రితం పోలీసు ఉన్నతాధికారులకు మొరపెట్టుకుంది. ఈ క్రమంలో, రఫీక్ పై విచారణ జరిపిన పోలీసులు, నివేదికను ఉన్నతాధికారులకు అందించారు. దీంతో, రఫీక్ ను తొలగిస్తూ వరంగల్ రేంజ్ ఐజీ ఈ రోజు ఉత్తర్వులు జారీ చేశారు.