: షోపియాన్ ప్రాంతంలోకి చొరబడిన ఉగ్రవాదులు.. ఒక ఉగ్రవాది హతం... జవానుకు గాయాలు
పీవోకేలో భారత సైన్యం జరిపిన లక్షిత దాడుల అనంతరం భారత్, పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఓ వైపు పాకిస్థాన్ రేంజర్ల కాల్పులు, మరోవైపు ఉగ్రవాదుల చొరబాట్లతో సరిహద్దు ప్రాంతాలు కాల్పులతో మోగిపోతున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్ ప్రాంతంలోకి ఉగ్రవాదుల చొరబాటును గుర్తించిన భారత సైన్యం వారిపై కాల్పులు జరిపి ఒక ఉగ్రవాదిని హతమార్చింది. ఉగ్రవాదులు జరుపుతున్న ఎదురుకాల్పుల్లో ఓ జవానుకు గాయాలయ్యాయి. భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.