: అక్రమ గోదాంల కూల్చివేతను అడ్డుకునేందుకు స్థానికుల యత్నం.. శంషాబాద్ లో తీవ్ర ఉద్రిక్తత

అక్రమ నిర్మాణాలపై హెచ్ఎండీఏ కొరడా ఝుళిపిస్తోంది. హైదరాబాద్ శివారులోని శంషాబాద్‌లో అక్రమనిర్మాణాలను కూల్చివేసేందుకు ఈ రోజు అధికారులు సిబ్బందితో కలిసి అక్కడకు చేరుకున్నారు. అక్కడి రషీద్‌గూడలో అక్రమంగా నిర్మించిన గోదాంలను కూల్చివేసేందుకు ప్రయత్నించారు. అయితే, గోదాంల కూల్చివేతను అడ్డుకునేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ స్థానికులకు, అధికారులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చెలరేగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు స్థానికులను అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నారు.