: ఫ్యాషన్ షోలో మెరిసి, మురిపించిన అమితాబ్ కుమార్తె
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కుమార్తె శ్వేతా బచ్చన్ నందా (42) ఓ ఫ్యాషన్ షోలో మెరిసింది. ముంబైలో నిన్న జరిగిన ఈ షోలో ఆమె ర్యాంప్ వాక్ చేసింది. అంతేకాదు, షో మొత్తానికి ఆమే టాపర్ గా నిలిచింది. తెలుపు రంగు దుస్తులను ధరించిన శ్వేత... ప్రేక్షకుల దృష్టిని తనవైపు లాగేసుకుంది. తమ ముద్దుల కూతురు పాల్గొన్న షోను చూసేందుకు ఆమె తల్లిదండ్రులు అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ కూడా తరలివచ్చారు. సోదరుడు అభిషేక్ కూడా వచ్చి శ్వేతకు శుభాకాంక్షలు తెలిపాడు. అంతేకాదు, శ్వేత ర్యాంప్ వాక్ చేస్తున్నప్పుడు అమితాబ్ స్వయంగా తన ఫోన్ తో వీడియో తీశారు. ఈ షోకు బాలీవుడ్ నటి సోనాలి బెంద్రే, దర్శకుడు అభిషేక్ కపూర్, అతని భార్య ప్రగ్నా యాదవ్ తదితరులకు కూడా వచ్చారు.