: కేసీఆర్! నా వెంట రా.. గ్రామాల దుస్థితి చూపిస్తా: తమ్మినేని సవాల్


ముఖ్యమంత్రి కేసీఆర్ తన వెంట వస్తే పల్లెల దుస్థితిని స్వయంగా చూపిస్తానని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సవాల్ విసిరారు. సీఎం కాకుంటే ఆయన కొడుకో, అల్లుడో ఎవరో ఒకరిని పంపాలని డిమాండ్ చేశారు. సీపీఎం మహాజన పాదయాత్ర సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. నాగర్‌కర్నూలు జిల్లా లింగాల, పెద్దకొత్తపల్లి మండలాల్లో యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రజల జీవితాలు బాగుపడతాయని ప్రజలు భావించారని, కానీ అందుకు భిన్నంగా జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో కరవు విలయ తాండవం చేస్తోందన్నారు. టీఆర్ఎస్ రెండున్నరేళ్ల పాలనలో కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, పేదలకు మూడెకరాల భూమి, లక్షల ఉద్యోగాల సంగతేంటని ప్రశ్నించారు. ప్రజా సమస్యలు పరిష్కారమయ్యే వరకు సీపీఎం వేటకుక్కలా వెంటాడుతుందని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News