: జిమ్ లో సమంత.. 72 కిలోల బరువు ఎత్తిన ముద్దుగుమ్మ!
దక్షిణాది ముద్దుగుమ్మ, సుకుమారి సమంత వెయింట్ లిఫ్టింగ్ చేస్తున్న ఒక తాజా వీడియో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పైగా, అదేమీ మామూలు బరువు కూడా కాదు.. ఏకంగా 75 కిలోల బరువును ఎత్తింది. ఆ దృశ్యాలను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ వెంటనే అభిమానులు స్పందించారు. ‘ఆసమ్’ అని ఒకరు, ‘సూపర్ ఉమన్’, ‘మైండ్ బ్లోయింగ్’ అంటూ అని మరికొందరు తమ వ్యాఖ్యలు చేశారు.