: ‘అమ్మ’ ఆరోగ్యంపై భయపడాల్సిన పని లేదు: విజయశాంతి
తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యంపై భయపడాల్సిన పని లేదని, ఆమె కోలుకుంటున్నారని ప్రముఖ నటి విజయశాంతి చెప్పారు. జయలలిత ఆరోగ్యంపై వాకబు చేసేందుకు చెన్నై అపోలో ఆసుపత్రికి ఈరోజు ఆమె వెళ్లారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, జయ చక్కగా బయటికొచ్చి పరిపాలన చేస్తారని, మరో పది రోజుల్లో ఆమె ఇంటికి వెళ్లే అవకాశాలున్నట్లు తెలిసిందని చెప్పారు. కాగా, మరో సినీ నటి నగ్మా కూడా జయలలిత ఆరోగ్యంపై వాకబు చేశారు.